GNTR: ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. శుక్రవారం విడుదల చేసిన వీడియోలో తన హెల్త్ అప్‌డేట్స్ పంచుకున్న ఆయన, బరువు తగ్గడానికి టాబ్లెట్లు వాడటం, ఇటీవల గుండెకు స్టెంట్లు పడటం గురించి పేర్కొన్నారు. ప్రమాదం జరగకముందే ప్రజలు ముందస్తు హెల్త్ చెకప్‌లు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: మాజీ మంత్రి


