హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాలమిత్రునికి తీవ్ర గాయాలు!

SRPT: వల్లాపురంలో శుక్రవారం సాయంత్రం పాడి పశువుకు కృత్రిమ గర్భధారణ చేస్తుండగా గోపాలమిత్రుడు యాదగిరి(62) తీవ్రంగా గాయపడ్డారు. పశువు బెదిరి ఎగరడంతో దానికి కట్టిన రాతి స్తంభం విరిగి ఆయనపై పడింది. దీంతో పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు గాయాలు కాగా, ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.