హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీ హబ్‌లో ఉచిత ఏఐ శిక్షణ..!

KMM: సాంకేతిక రంగంలో ఉపాధి కోసం ఖమ్మం ఐటీ హబ్‌లో ఈ నెల 14 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ రీజినల్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆధునిక నైపుణ్యాలతో కెరీర్ సాధించాలనుకునే అభ్యర్థులు ఈ నెల 11 లోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.