KKD: జిల్లాలోని కోటనందూరులో మైనర్ బాలికకు వివాహం జరిపించిన ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆగస్టు 30న జరిగిన ఈ బాల్య వివాహంపై ఫోటోలుతో సమాచారం అందడంతో ప్రోహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ -2026 కింద దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు చేయబోమని హామీ తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహంపై కేసు నమోదు: ఎస్సై


