హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

WGL:శ్రావణ మాసం శనివారం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేషాభిషేకాలు, పూజలు చేసి నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.