MHBD: నెల్లికుదురు మండలం మునిగలవేడు సబ్‌స్టేషన్ ఎదుట గ్రామస్తులు శుక్రవారం రాత్రి కోవత్తులతో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాత్రివేళల్లో తరచూ విద్యుత్ కోతలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలపై గ్రామస్తుల ధర్నా


