హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు

ASF: చింతలమానెపల్లి మండలంలోని గూడెం చెక్ పోస్ట్ వద్ద రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. SI కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం, చింతలమానెపల్లికి చెందిన టాటాఏస్ వాహనంలో రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తుండగా క్వింటాల్ రేషన్ బియ్యం పట్టుకున్నామన్నారు. చౌదరి రేణుక, డ్రైవర్ హుస్సేన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.