MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బృందావన కాలనీలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు పది ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. ఫ్యాన్లు, టీవీలు, ఇతర పరికరాలతో పాటు ఓ హోటల్‌లో ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం చార్జర్ దగ్ధమయ్యాయి. విద్యుత్ నియంత్రిక వద్ద ఎర్త్ తీగ సమస్యతో ప్రమాదం జరిగినట్లు విద్యుత్ సిబ్బంది గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ ఉపకరణాలు దగ్ధం


