NRML: కుభీర్ మండలం గోడాపూర్ గ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతున్నారన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఓ వ్యక్తి ఇంటి పెరట్లో తనిఖీ చేయగా రెండు పెద్ద గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
గంజాయి మొక్కలు స్వాధీనం


