హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్మా గాంధీ పరీక్షల షెడ్యూల్ విడుదల

NLG: నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ సెమిస్టర్-9 (రెగ్యులర్) పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.