హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిరేకల్‌లో సీఎం సభ.. ట్రాఫిక్ మళ్లింపు

NLG: నకిరేకల్‌లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, నకిరేకల్ పట్టణంలో రద్దీ నివారణకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం రాత్రి తెలిపారు. సభకు వచ్చే వారు తిప్పర్తి సర్వీస్ రోడ్డు, ఇందిరాగాంధీ సెంటర్ మీదుగా మినీ స్టేడియం గ్రౌండ్‌కు చేరుకోవాలని సూచించారు. పోలీసుల సూచనలకు ప్రజలు సహకరించాలని కోరారు.