హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వ్యక్తి మృతి.. వివరాలు తెలపండి

SRCL: సిరిసిల్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలరాజు (60) గురువారం ఉదయం మృతి చెందినట్లు సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 26న ఆసుపత్రిలో చేరిన ఆయన తన పేరు, వయసు తప్ప ఇతర వివరాలు చెప్పలేదన్నారు. ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని సీఐ కోరారు.