హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల పేరిట రూ.4.25 లక్షలకు టోకరా!

NZB: ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరి నుంచి రూ.4.25 లక్షలు వసూలు చేసిన నకిలీ ఏజెంట్‌ను ఆర్మూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా మున్యాల్ గ్రామానికి చెందిన నాగవత్ ప్రవీణ్ ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రవీణ్ నమ్మించాడు. విడతల వారీగా ఇద్దరి నుంచి రూ.4.25 లక్షలు వసూలు చేశాడు.