హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

MNCL: మంచిర్యాల, చెన్నూరు, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి కోర్టుల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. సివిల్ దావాలు, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులతో పాటు ఇతర వివాదాలను ఇరువర్గాల అంగీకారంతో రాజీ చేసుకోవచ్చని వివరించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.