హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిద్రపోతున్న సమయంలో.. ఇల్లు గుల్ల చేశారు

KMR: మద్నూర్, మేనూర్ గ్రామాల్లో గురువారం రాత్రి దొంగలు విరుచుకుపడ్డారు. మద్నూర్‌లో రెండు ఇళ్లల్లో, మేనూర్‌లో మూడు ఇళ్లల్లో వరుస చోరీలు జరిగాయి. ఈ ఘటనలు శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుల సమాచారంతో ఎస్సై మోహన్ రెడ్డి ఘటనా స్థలాలను పరిశీలించారు. బాధితుల నుంచి నిన్న ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.