మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో సన్మాన కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఈఓ రాజు వెల్లడించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతిభ కనబరిచి ఎంపికైన 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేస్తామని, వీరంతా వేళకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
నేడు మెదక్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం


