హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు నేడు యూరియా పంపిణీ: ఏవో

MDK: రామాయంపేట మండల రైతుల కోసం నేటి ఉదయం 8:30 గంటల నుంచి యూరియా బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. యాప్‌లో మండల స్థాయి మార్పులు చేయడంతో స్థానిక రైతులకు మాత్రమే కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. రైతులందరికీ సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.