NZB: డిచ్‌పల్లి NH-44పై ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్ నుంచి HYD వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి


