MDK: రేగోడ్ మండలం టి.లింగంపల్లి శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై పోచయ్య సిబ్బందితో కలసి హఠాత్తుగా దాడి చేశారు. పోలీసుల రాకను గుర్తించిన ఒక వ్యక్తి పరారు కాగా, మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹7,850 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రేగోడ్‌లో పేకాట రాయుళ్ల అరెస్ట్


