ADB: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో ఓ వ్యక్తి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు DSP జీవన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. నిందితులు నకిలీ రెవెన్యూ పట్టాలు, జీపీ రసీదులు సృష్టించి ఒకే ప్లాటుపై పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఆస్తుల పత్రాలు భద్రంగా ఉంచుకోవాలని DSP హెచ్చరించారు.
తెలంగాణ
నకిలీ పత్రాలతో స్థల కబ్జా యత్నం.. నలుగురు అరెస్ట్


