హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెంచికలపాడుకు రెగ్యులర్ ఏఈఓను నియమించాలి'

GDWL: గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి రెగ్యులర్ వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలని సర్పంచ్ కుర్వ ఆంజనేయులు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హోలింపాష డిమాండ్ చేశారు. మండలంలో 11 క్లస్టర్లకు గతంలో 11 మంది ఏఈఓలు ఉండగా ప్రస్తుతం 9 మందే ఉన్నారని తెలిపారు. దీంతో పంటల నమోదు, ఎరువుల పంపిణీ వంటి సేవలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.