TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్ కింద ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లు ఉండగా, కొత్తగా మరో 24 కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
వార్తలు
నిమ్స్‌లో ఉచిత ఓపీ కొనసాగించాలి: దామోదర


