హైదరాబాద్: 28°C
వార్తలు

కుండపోత వర్షం.. రోడ్లు జలమయం

దేశ రాజధాని దిల్లీలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై నీరు నిలిచిపోయింది. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోసారి భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించింది.