హైదరాబాద్: 28°C
వార్తలు

కొండపేట చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

KDP: చెన్నూరు(M) కొండపేటలో ఏడాది క్రితం నంద్యాల నరేంద్ర ఇంట్లో జరిగిన చోరీ కేసులో చాపాడు మండలానికి చెందిన కొప్పెర్ల ప్రసన్నకుమార్‌ (26)ను శుక్రవారం చెన్నూరు సీఐ చాంద్‌ బాషా అరెస్ట్ చేశారు. అతని నుంచి 22 గ్రాముల బంగారం, 79 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కడప మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు CI తెలిపారు.