ప్రకాశం: అర్ధవీడులోని బొల్లుపల్లి బీట్ అల్లురేణి కుంట సమీపంలో పులి దాడిలో గేదె మృతి చెందినట్లు సమాచారం. బొల్లుపల్లి గ్రామానికి చెందిన బాషుకు చెందిన గేదె మేతకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామస్థులు గాలించగా అల్లురేణి కుంటలో గేదె కళేబరం శుక్రవారం గుర్తించినట్లు తెలిపారు. సుమారు రూ.90 వేల విలువైన గేదెను కోల్పోయిన తనకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాషు కోరారు.
వార్తలు
పులి దాడిలో గేదె మృతి


