హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. బుద్గాం జిల్లా పరిధిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని కీలక పత్రాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.