హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం కొత్త స్కీమ్.. కరువైన ఆదరణ

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్‌కు ఆదరణ కరువైంది. రూ.37,500 కోట్ల ప్రోత్సాహక పథకం కింద ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఇప్పటివరకు ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రైవేటు, ప్రభుత్వ రంగం నుంచి ఎలాంటి దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యంగా ఇటీవల ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది.