హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పప్పు దినుసులతో రాధాకృష్ణన్ చిత్రం

VZM: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొత్తవలస మండలం దెందేరు జడ్పీ స్కూల్ 8వ తరగతి విద్యార్థి కోరిబిల్లి హర్షవర్ధన్ పప్పు దినుసులతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని అద్భుతంగా వేశాడు. డ్రాయింగ్ టీచర్ జి.ఎమ్.జి. పరమేశ్వరరావు స్ఫూర్తితోనే దీనిని రూపొందించినట్లు తెలిపాడు. తనకు డ్రాయింగ్ అంటే ఎంతో మక్కువ అని విద్యార్థి హర్షవర్ధన్ పేర్కొన్నాడు.