TPT: సత్యవేడు మండలం చిన్న ఈటిపాకం వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెలతో అధికంగా లోడ్ చేసిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో సమీపంలోని ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదంలో భారీగా కట్టెలు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కట్టెల లోడ్ ట్రాక్టర్ బోల్తా.. బస్సుకు ఢీ


