హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

కర్నూలు జిల్లాలో ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను తప్పించబోయి అదుపుతప్పిన కారు హంద్రీనీవా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.