హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

E.G: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ‘శ్రావణ మాసం’ సందర్భంగా ఉచిత శ్రావణ వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సుమారు 1500 మంది ముత్తయిదువులతో ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వీకేఏ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరఫుర  కుంకుమ, పసుపు, గాజులు, ప్రసాదం అందించారు.