హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ క్యాలెండర్ కోసం SFI నిరసన

KRNL: రాయలసీమ జోన్ పరిధిలోని 11,639 ఖాళీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని SFI జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్‌లో నిరుద్యోగులతో కలిసి బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.