హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు-బొలెరో ఢీ.. MEOకు స్వల్ప గాయాలు

CTR: పుంగనూరు-మదనపల్లె మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి MEO జనార్దన్‌రెడ్డి గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నాయి. తలకు స్వల్ప గాయం కావడంతో 108 వాహనంలో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యాశాఖ అధికారులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.