హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామ రైతుపేటలో వీధి కుక్కల స్వైరవిహారం

NTR: నందిగామ పట్టణంలోని రైతుపేట వీధుల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న శునకాలు రహదారులపై స్వైరవిహారం చేస్తూ ప్రజలను, వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఒంటరిగా వెళ్లే పాదచారులపై కుక్కలు అకస్మాత్తుగా దాడికి దిగుతున్నాయంటు స్థానికులు కలవరపడుతున్నారు.