AKP: చీడికాడ మండలంలో తునివలస బయలుపూడి, బి. సింగవరం గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం శంకుస్థాపన చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఆలయాలు దోహదపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


