NDL: రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు కోరారు. నంద్యాల రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలూ తీసుకోవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘అనుమానాస్పదంగా కనిపిస్తే చెప్పండి’


