హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిరుపయోగంగా తాగునీటి బోరు

శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో ఉన్న తాగునీటి బోరు మరమ్మత్తుకు గురైంది. గత కొన్ని రోజులుగా నీరు రాకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట నుంచి నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు స్పందించి బోరును మరమ్మత్తు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.