హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేజర్ కాలువకు గండి

NLG: త్రిపురారం మండల పరిధిలోని తుంగపాడు వద్ద ఈరోజు నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అలవాల సమీపంలో రాజవరం మేజర్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది. ఇటీవలె చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నీరు ఈ గండి వల్ల వృథాగా పారుతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.