WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని బీసీ కాలనీలో శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో భక్తుల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోవులను పసుపు, కుంకుమలతో అలంకరించారు. కృష్ణాష్టమి వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తెలంగాణ
వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు


