హైదరాబాద్: 28°C
తెలంగాణ

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

KNR: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కమలాపూర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలో ర్యాలీ, రాస్తారోకో, వంటా-వార్పు నిర్వహించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు రూ.2,500 సాయం, వంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.