హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీ స్వామివారి నిత్యకల్యాణం

BDK: భద్రాచలం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ సీతారాముల కల్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.