హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

SRPT: తుంగతుర్తి పట్టణంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన అర్చకులు కాటూరి రామాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శ్రీకృష్ణుడికి అభిషేకాలు, పంచామృతాలు, విశేష పూజలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడి లీలలు, తాత్విక చింతనలను భక్తులకు వివరించారు.