హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైల్వే పనుల భూసేకరణ వేగవంతం చేయాలి'

మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్వే లైన్ డబ్లింగ్, స్టేషన్ల విస్తరణకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. అర్బన్ పరిధిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించి, అవార్డు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. భూ యజమానులకు పరిహారం చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.