NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై గల శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో శుక్రవారం సుదర్శన హోమమును కన్నుల పండుగగా నిర్వహించారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమం క్రతువులో పాలు పంచుకున్నారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రత్యేక అర్చనలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో రుద్ర వెంకటేశం, అర్చకులు ఉన్నారు.
తెలంగాణ
గోపలాయపల్లి గుట్టపై ఘనంగా సుదర్శన హోమం


