WGL: నర్సంపేటలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్, సరస్సు అందాలు డ్రోన్ కెమెరాలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. పచ్చని అడవుల నడుమ విస్తరించిన సరస్సు ఆకాశం నుంచి మరింత మనోహరంగా కనిపించింది. ప్రకృతి ఒడిలో ఒదిగిన పాకాల సోయగాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. డ్రోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తెలంగాణ
VIDEO: డ్రోన్ కెమెరాలో పాకాల అందాలు.. వైరల్‌గా దృశ్యాలు


