హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై నీరు.. వాహనదారుల ఇబ్బందులు

GDWL: ధరూర్ మండలం రేవులపల్లి నుంచి గద్వాల్ వెళ్లే మార్గంలో కల్వర్టు వద్ద నీరు రోడ్డుపై నుంచే ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షకాలంలో నిరంతరం నీరు పారడంతో రహదారి నాచుపట్టి, వాహనదారులు జారి కింద పడుతున్నారు. వర్షాకాలం వస్తే ప్రతీసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.