హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యగారిపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాల కలకలం

MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో గుప్త నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టారన్న ప్రచారం గ్రామంలో శుక్రవారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.