హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణలు తొలగించాలంటూ మున్సిపల్‌ ఆదేశాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఫుట్‌పాత్ ఆక్రమణలపై శుక్రవారం మున్సిపల్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జాతీయ రహదారి వెంట చిరు వ్యాపారులు సామగ్రిని వెనక్కి తీసుకోవాలని, ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. ప్రధాన కాలువలపై ఆక్రమణలు చేయవద్దని హెచ్చరించారు. కాగా, చర్యలు ఛైర్మన్‌ ఇంటి నుంచే ప్రారంభించాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.