హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ASF: దహెగాం మండలం లగ్గాంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు రాజయ్యాచార్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నేడు మహాభిషేకం, ఏకమా భజనలు, శ్రీకృష్ణ ఊయల సేవ, దీపారాధన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు స్థంభారోహణం, అన్నప్రసాద వితరణ, రథ శోభాయాత్ర ఉంటాయని తెలిపారు.