BHPL: మహదేవపూర్‌లో ఓ కోళ్ల గూటిలోకి శ్వేత నాగుపాము ప్రవేశించడంతో కలకలం రేగింది. గూటిలో ఉన్న కోడిని కాటేసిన పాము, పొదిగిన పది గుడ్లను మింగేసింది. అనంతరం కదల్లేక అక్కడే ఉండిపోయింది. కోళ్లు పెద్దగా అరవడంతో యజమాని ఆనంద్ గమనించి స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు
తెలంగాణ
VIDEO: కోళ్ల గూటిలో శ్వేత నాగుపాము


